మరో మంచి అవకాశం దక్కించుకున్న మెహ్రీన్ !
Published on Nov 14, 2017 9:47 am IST

ప్రస్తుతం టాలీవుడ్లో మెహ్రీన్ కౌర్ హవా నడుస్తోంది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్’ ఇలా ఆమె చేసిన సినిమాలన్నీ వరుసగా విజయాలు సాధిస్తుండటంతో మంచి మంచి అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే మెహ్రీన్ నటించిన ‘జవాన్’ విడుదలకు సిద్ధమవుతుండగా ఇప్పుడు మరొక మాస్ హీరో సినిమాలో కూడా ఆమెకు అవకాశం దక్కినట్టు తెలుస్తోంది.

అదే గోపీచంద్ నూతన చిత్రం. హీరో గోపీచంద్ ప్రసుతం కొత్త దర్శకుడు చక్రి డైరెక్షన్లో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో ఆయన సరసన హీరోయిన్ గా పలువుర్ని పరిశీలించిన మేకర్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న మెహ్రీన్ అయితే బాగుంటుందని, సినిమాకు కూడా కలిసొస్తుందని ఆమెను ఫైనల్ చేశారని, ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ గురించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook