‘ఎం.ఎల్.ఏ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే !

17th, March 2018 - 12:47:00 PM

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎం.ఎల్.ఏ’. ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుని మార్చి 23న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ముందుగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఈరోజు కర్నూలులో నిర్వహించాలని భావించిన చిత్ర యూనిట్ కొన్ని అనివార్య కారణాల వలన దాన్ని వాయిదా వేసింది.

తాజా సమాచారం మేరకు ఈ నెల 21న హైదరాబాద్లోనే ఈ వేడుకను నిర్వహించానున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు కళ్యాణ్ రామ్ సోదరుడు జూ. ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది.