గ్యాప్ తరువాత ‘గాయత్రి’తో వస్తున్న మోహన్ బాబు
Published on Jul 29, 2017 9:31 am IST


సీనియర్ హీరో మోహన్ బాబు దాదాపు 2 ఏళ్ల తరువాత తాను నటించే కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. 2015 లో మామ మంచు అల్లుడు కంచు చిత్రంలో మోహన్ బాబు నటించారు. రెండేళ్ల గ్యాప్ తరువాత ఈ సీనియర్ హీరో నటించబోయే చిత్రం నిన్న లాంచ్ అయింది. ఈ చిత్రానికి టైటిల్ ‘గాయత్రి’. మంచు కుటుంబం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

మోహన్ బాబు మనవరాళ్లు వివియానా, అరియనా మరియు విద్యానిర్వాణ కూడా పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు. మోహన్ బాబు స్వయంగా ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. మదన్ ఈ చిత్రానికి దర్శకుడు. థమన్ సంగీత దర్శకత్వం వహించనున్నారు.

 
Like us on Facebook