“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” ట్రైలర్ అదిరిపోయిందిగా..!

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్” ట్రైలర్ అదిరిపోయిందిగా..!

Published on Sep 30, 2021 8:12 PM IST


అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్”. ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

హీరో, హీరోయిన్‌ల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. డైలాగ్స్ కూడా బాగున్నాయి. లవ్‌, రొమాన్స్, కామెడీ అంశాలతో కూడుకున్న ఈ ట్రైలర్ అదిరిపోయింది. గోపి సుందర్ అందించిన మ్యూజిక్ ఆద్యంతం అలరిస్తుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు