లేటెస్ట్..”కేజీయఫ్ 2″ మాసివ్ ట్రైలర్ లాంచ్ కోసం మిస్టర్ బాక్సాఫీస్.!

Published on Mar 27, 2022 12:25 pm IST

లేటెస్ట్ గా ఇండియన్ సినిమా దగ్గర బాక్సాఫీస్ రికార్డులు తిరగ రాస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “రౌద్రం రణం రుధిరం”. మెగాపవర్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తర్వాత మళ్ళీ పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలు సెట్ చేసుకొని విడుదల కి రెడీగా ఉన్న భారీ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”.

సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ మరికొన్ని రోజుల్లో రిలీజ్ కి రెడీ గా ఉన్న ఈ చిత్రం తాలూకా గ్రాండ్ ట్రైలర్ ని ఈరోజు రిలీజ్ చెయ్యడానికి అంతా సెట్ చెయ్యగా ఇప్పుడు లేటెస్ట్ గా మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ ని ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని లాంచ్ ని లాంచ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మరి ఈ సాలిడ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :