నలుగురు యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ లాంచ్ !


తెలుగు మల్టీ స్టారర్ సినిమాలు ఊపందుకున్న నైపథ్యంలో ఒకేసారి ముగ్గురు నలుగురు యంగ్ హీరోలతో సినిమా చేయనున్నాడు దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య. శ్రీ రామ్ ఆదిత్య ‘భలే మంచి రోజు’ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో సుందీప్ కిషన్, ఆది, సుధీర్ బాబు, నారా రోహిత్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈరోజే ప్రారంభోత్సవం జరుపుకుంది. దర్శకుడు శ్రీను వాడుఇట్ల మొదటి క్లాప్ ఇచ్చి చిత్రాన్ని మొదలుపెట్టారు.

చిత్రానికి ‘శమంతకమణి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఫిక్స్ చేశారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ చిత్రం మార్చి మొదటి వారం నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. ఇందులో హీరోయిన్లు, ఇతర సాంకేతిక నిపుణుల ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇలా ఒకేసారి నలుగురు హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయనుండటం సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకులను ఆసక్తిని, ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.