“సర్కారు వారి పాట” సాంగ్ లీక్‌పై తమన్ ఎమోషనల్ కామెంట్స్..!

Published on Feb 13, 2022 2:00 am IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ “కళావతి” ఫుల్ సాంగ్‌ లీక్ కావడంపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందిస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన ఆవేదనని తెలియచేస్తూ ఆడియో క్లిప్స్‌ని పోస్ట్ చేశాడు.

ఈ సాంగ్ లీక్ కావడంతో మనసు చాలా బాధగా ఉందని, ఏం చెప్పాలో కూడా అర్ధం కావడం లేదని, ఆర్నెళ్లుగా ఎంతో కష్టపడ్డామని, ఈ పాట షూటింగ్ సమయంలో కొందరు కరోనా బారిన కూడా పడ్డారని అన్నారు. ఈ పాట కోసం దాదాపు వెయ్యి మంది పనిచేశారని, ఎంతో టెక్నాలజీని ఈ పాటకు వాడామని.. కానీ చాలా ఈజీగా నెట్‌లో వీడియో పెట్టాడని, వాడికి పని ఇస్తే.. వాడు మాకు ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదని.. గుండె తరుక్కుపోతుందని తమన్ అన్నాడు.

సంబంధిత సమాచారం :