చిరంజీవి, చరణ్ లతో ‘మగధీర -2’ !

12th, September 2017 - 04:20:08 PM


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కెరీర్లో ఎప్పటికీ గొప్ప సినిమాగా నిలిచిపోయేది ‘మగధీర’. 2009 లో రూపొందిన ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్లు అప్పట్లో ఒక సంచలనం. ఇప్పటికీ తెలుగు పరిశ్రమలోని ఆణిముత్యాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచే ఉంది. ఈ సినిమాకి సీక్వెల్ ను రూపొందించే పనులు జరుగుతున్నాయని ఈ మధ్య ఒక వార్త బయటికొచ్చింది. దానికి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారని కూడా అన్నారు.

ఇదే అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా ప్రస్తుతం అలాంటిదేం లేదని అన్న ఆయన ఎప్పటికైనా చిరంజీవి, రామ్ చరణ్ లతో ‘మగధీర-2’ రూపొందాలని, దానికి తానే కథను రాయాలని, ఆ కథను తన కుమారుడు రాజమౌళియే డైరెక్ట్ చేయాలనేది తన కోరికని చెప్పుకొచ్చారు. మరి ఆయన కల త్వరలోనే నిజమవ్వాలని మనం కూడా కోరుకుందాం.