రేపటి నుండి ‘నా పేరు సూర్య’ క్లైమాక్స్ !

‘చచ్చిపోతాను గాడ్ ఫాదర్.. కానీ ఇక్కడ కాదు. బోర్డర్ కెళ్ళి’ అంటూ ‘నా పేరు సూర్య’ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఒక ఊపు ఊపేసింది. ఫస్ట్ ఇంపాక్ట్ తోనే బోలెడంత క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమ్ కూడా అనుకున్న సమయానికి సినిమాని రీలీజ్ చేసేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుతోంది.

ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణ పూర్తికాగా రేపటి నుండి కీలకమైన క్లైమాక్స్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రం కోసం బన్నీ యూఎస్ ట్రైనర్ల వద్ద కఠినమైన శిక్షణ తీసుకుని, సరికొత్త మేకోవర్ తో కనిపిస్తున్నారు. వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించగా సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ బన్నీకి తండ్రి పాత్రలో కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో నాగబాబు సమర్పిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది.