‘నా పేరు సూర్య’ విడుదల తేదీని అనౌన్స్ చేసిన బన్నీ అండ్ టీమ్ !
Published on Aug 2, 2017 4:14 pm IST


ఆచి తూచి కథల్ని ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ అదే జోరును కొనసాగిస్తూ ఈరోజు తన కొత్త చిత్రం ‘నా పేరు సూర్య’ ను మొదలుపెట్టనున్నారు. కొద్దిసేపటి క్రితమే రెగ్యులర్ షూట్ మొదలైంది. ఇదిలా ఉండగానే చిత్ర టీమ్ అప్పుడే ఈ సినిమా యొక్క విడుదల తేదీనికూడా ప్రకటించేసింది. వచ్చే ఏడాది 2018 ఏప్రిల్ 27న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట.

మొదలుపెట్టకముందే ఇలా విడుదల తేదీని అనౌన్స్ చేస్తున్నారంటే టీమ్ ఎంత పక్కా ప్లానింగ్ తో ఉందో తెలిసిపోతోంది. బన్నీ ఆర్మీ అఫీషియల్ గా కనిపించనున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. నా ఇల్లు ఇండియా అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా దేశభక్తి నైపథ్యంలో ఉండనుంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ అందిస్తున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం సమకూర్చనున్నారు.

 
Like us on Facebook