వివాహ జీవితం హాయిగా ఉందంటున్న నాగ చైతన్య !
Published on Dec 15, 2017 8:34 am IST

ఎన్నాళ్లగానో ప్రేమలో మునిగి తేలిన నాగ చైతన్య, సమంతల జంట ఇటీవలే వివాహ వేడుకతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమ ప్రయాణాన్ని చూసి ముచ్చటపడని వారంటూ లేరు. అంతలా హాట్ టాపిక్ అయ్యింది వీరి ప్రేమ, పెళ్లి వ్యవహారం. పెళ్లి తర్వాత కొద్దిగా మాత్రమే గ్యాప్ తీసుకుని తిరిగి ఎవరి సినిమాల్లో వాళ్ళు ముగిపోయారు చై, సమంత.

నిన్న ఒక జ్యూవెల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన నాగ చైతన్యను అక్కడి మీడియా మీ వైవాహికి జీవితం ఎలా ఉంది అనే ప్రశ్న అడగ్గానే ఏమాత్రం సందేహించకుండా పెళ్లి తరవాత జీవితం చాలా హాయిగా, సంతోషంగా ఉంది అంటూ నవ్వుతూ జవాబిచ్చారు చై. ప్రస్తుతం చైతన్య చందూ మొండేటి డైరెక్షన్లో ‘సవ్యసాచి’ సినిమా చేస్తుండగా సమంత ‘రంగస్థలం 1985’ లో నటిస్తున్నారు.

 
Like us on Facebook