కరోనా థర్డ్ వేవ్ పై హాట్ నాగబాబు కామెంట్స్.!

Published on Jul 14, 2021 9:00 am IST

ప్రపంచం అంతా కూడా కరోనా వైరస్ మూలాన ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొందో తెలిసిందే. ఆల్రెడీ ఒకసారి కంప్లీట్ అయ్యి రెండో దశ వ్యాప్తి కూడా తగ్గుముఖం పడుతుంది. కానీ అంతకు మించిన ప్రమాదం మూడో వేవ్ లో వస్తుంది అని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. అయితే మూడో వేవ్ రావడానికి కారణం ఓ రకంగా ప్రజలు ప్రభుత్వాలు అని కూడా అందరికీ తెలిసిందే.

పలు జాతీయ కార్యక్రమాలు అయితేనేం నిర్లక్ష్యాల వల్ల పెను ప్రమాదానికి మనమే స్వాగతం పలుకుతున్న వాళ్ళం అవుతున్నాం. మరి దీనిపైనే మెగా బ్రదర్ నాగబాబు తన వ్యూ ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇలాంటి విషయాల్లో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే నాగబాబు రానున్న కరోనా మూడో వేవ్ పై కూడా కాస్త ఘాటుగానే తన స్పందనను తెలియజేసారు.

ఇంతకు ముందు అయితే భారత్ కరోనా మూడో వేవ్ ని అడ్డుకోగలదని నమ్మకం ఉండేది అని కానీ ప్రభుత్వం ఎప్పుడైతే కన్వర్ యాత్రకి అనుమతి ఇచ్చారో ఇక థర్డ్ వేవ్ వల్ల ప్రమాదం తప్పేలా లేదని ఇపుడు భారత్ ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి ఈ యాత్రని ఆపాలి లేదా కరోనా మూడో వేవ్ ని ఆహ్వానించాలని తన స్పందనను తెలియజేసారు. ప్రస్తుతం నాగబాబు పలు సినిమాలు తన యూట్యూబ్ ఛానెల్స్ తో బిజీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం :