మైసూర్‌ లో నాగ్ ‘బంగార్రాజు’ !

Published on Sep 6, 2021 8:31 am IST

అక్కినేని నాగార్జున సూపర్ హిట్ సినిమా ‘సోగ్గాడే చిన్నినాయన’ సీక్వెల్ ‘బంగార్రాజు’ రీసెంట్ గా హైదరాబాద్‌ షెడ్యూల్‌ ముగించుకుంది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం మైసూర్‌ లో జరుగుతోంది. నాగచైతన్య పై ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్ కోసం ఇప్పటికే ప్రత్యేక సెట్‌ కూడా వేశారట. ఈ సెట్‌ లో ముందుగా చైతు, రమ్యకృష్ణల పై కీలక సీన్స్ ను షూట్ చేస్తారట.

ఇక ఈ సినిమాలో నాగచైతన్యకి జోడీగా క్రేజీ హీరోయిన్ కృతిశెట్టి నటించబోతుంది. ‘మనం’ తర్వాత నాగార్జున – నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. సంక్రాంతికి విడుదల చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంవహిస్తున్నారు.

‘సోగ్గాడే… ’ చిత్రంతోనే పరిచయమైన కళ్యాణ్ కృష్ణ ‘బంగార్రాజు’తో మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :