నాగార్జున, ఆర్జీవీల సినిమా ‘శివ’కు సీక్వెల్ కాదట !
Published on Nov 20, 2017 11:32 am IST

నాగార్జున, రామ్ గోపాల్ వర్మల నూతన చిత్రం ఈరోజే అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది. అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంపై భారీస్థాయి అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘శివ’ ఇండస్ట్రీని షేక్ చేయడంతో ఈసారి కూడా అలాంటి సినిమానే ఇస్తారని అందరూ ఆశిస్తున్నారు.

ఈరోజు తేదీ నుండి వరుసగా 10 రోజులపాటు ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. అనంతరం నాగార్జున అఖిల్ యొక్క ‘హలో’ చిత్ర విడుదల పనుల్లో బిజీ కానుండటం వలన గ్యాప్ తీసుకుని, ఆ చిత్రం విడుదలయ్యాక 22 నుండి మరల చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు. వర్మ తన ‘కంపెనీ’ సంస్థ ద్వారా స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సాంకేతికంగా హాయ్ స్టాండర్డ్స్ లో ఉండనున్న ఈ సినిమా ‘శివ’ కు సీక్వెల్ కాదని, ఇంకా ఇతర నటీ నటులను నిర్ణయించాల్సి ఉందని తెలుస్తోంది.

 
Like us on Facebook