అఖిల్ సినిమాకి నాగార్జున వాయిస్ ఓవర్ ?
Published on Nov 12, 2017 2:55 pm IST

అక్కినేని అఖిల్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘హలో’. మొదటి సినిమా పరాజయం తర్వాత అఖిల్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేస్తున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన కూడా లభించింది.

తాజాగా సినీ వర్గాల్లో ఈ సినిమా గురించి వినిపిస్తున్న వార్తల ప్రకారం త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్ర టీజర్ కు అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్ చెప్పనున్నారట. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణి హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook