రవితేజతో ఈషా రెబ్బ‌ స్పెషల్ సాంగ్ ?

Published on Nov 15, 2021 7:06 am IST

మాస్ మహారాజా రవితేజ – నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రాబోతున్న కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో ఒక స్పెషల్ సాంగ్ ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఈ సాంగ్ లో అనసూయ నటిస్తోందని ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు ఈ సాంగ్ పై మరో పుకారు వినిపిస్తోంది. హీరోయిన్ ఈషా రెబ్బ‌ ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుందట. మొదట పాయల్, ఆ తర్వాత అనసూయ.. ఇప్పుడు ఈషా రెబ్బా పేరు వినిపిస్తోంది.

అయితే, ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అసలు ఈషా రెబ్బా అయితే గతంలో స్పెషల్ సాంగ్స్ చేసింది కూడా లేదు. మరి ఈ సినిమాలో ఎలా నటిస్తోందో చూడాలి. ఇక దర్శకుడు ‘త్రినాథరావు నక్కిన’కు చిన్న సినిమాల కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరు ఉంది. అందుకే ఈ సినిమాలో కామెడీ ఓ రేంజ్ లో ఉంటుందని రవితేజ కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. ప్రస్తుతానికైతే రవితేజ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

సంబంధిత సమాచారం :