ఆసక్తిగా అనిపిస్తున్న “నల్లమల” టీజర్.!

Published on Sep 30, 2021 3:30 pm IST

ఇప్పుడు తెలుగు సినిమాల్లో ఎక్కువగా ఓ సినిమాపై మంచి ఆసక్తి రేపడానికి పాటలు అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. సంగీత దర్శకుడు ఎవరు అన్నది పక్కన పెడితే ఓ సినిమాకి చెందిన అద్భుతమైన ట్యూన్ కనుక బయటకి వస్తే దాని వాళ్ళ సినిమాకి ఫేమ్ వస్తుంది. అలానే ఇప్పుడు టాలీవుడ్ లో రిలీజ్ కి రెడీ అవుతున్న ఓ సినిమా “నల్లమల”.

ఎక్కువగా విలన్ పాత్రల్లో కనిపించి మెప్పించిన నటుడు అమిత్ తివారి ఈ సినిమాతో హీరోగా గ్లామరస్ యాంకర్ కం నటి భాను శ్రీ హీరోయిన్ గా రవి చరణ్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమానే ఈ “నల్లమల”. ఇప్పుడు ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ ని రిలీజ్ చేశారు.. మరి ఇందులో పెద్దగా డీటెయిల్స్ రివీల్ చేయకున్నా ఇది మాత్రం ఆసక్తికరంగా ఉందని చెప్పాలి.

సినిమా సెటప్ అంతా కూడా 1980వ దశకంలో కనిపిస్తుంది. ఆ సమయంలో నల్లమల ప్రాంతంలో జరిగినటువంటి అంతర్యుద్ధంపై సన్నివేశాలను ఇందులో చూపిస్తున్నారు. మరి వీటిలో నిర్మాణ విలువలు కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఉన్నతంగా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే పి ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.

ఇంకా తాను ఇచ్చిన సాంగ్ సిద్ శ్రీరామ్ వాయిస్ తో మ్యాజిక్ నే చేసి సినిమాకి మంచి గుర్తింపు కూడా తెచ్చింది. ఓవరాల్ గా మాత్రం ఈ టీజర్ యాక్షన్, ఎమోషన్స్, డ్రామా అన్ని కీలక ఎమోషన్స్ తో ప్రామిసింగ్ గానే ఉంది. మరి నిర్మాత సంస్థ నమో క్రియేషన్స్ వారు ఎప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేస్తారో చూడాలి.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :