ఆకాష్ పూరి “చోర్ బజార్” ట్రైలర్ లాంచ్ చేసిన బాలకృష్ణ

Published on Jun 9, 2022 4:52 pm IST


ఆకాష్ పూరి చోర్ బజార్ అనే ఫన్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. జీవన్‌రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గెహ్నా సిప్పీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రం హైదరాబాద్ గల్లీ బ్యాక్‌డ్రాప్‌లో సెట్ చేయబడిన సరైన హైదరాబాదీ మాస్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.

ఆకాష్‌ మళ్లీ మాస్‌ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన డైలాగులు యూత్‌ని విశేషం గా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ లో హీరో ఆకాష్ పూరి మాస్ ఫన్ క్రియేట్ చేశాడు అని చెప్పాలి. గెహానా ఒక మూగ స్త్రీగా నటించింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఐ వి ప్రొడక్షన్స్ పతాకంపై విఎస్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేష్ బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన రిలీజ్ డేట్ ను అతి త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :