“ఎఫ్ 3” చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేసిన నందమూరి నటసింహం!

Published on Jun 1, 2022 7:00 pm IST

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎఫ్ 3. ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ప్రముఖులను సైతం విశేషం గా ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రం ను తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ చూడటం జరిగింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి తో సినిమా చూసి ఎంజాయ్ చేయడం మాత్రమే కాకుండా, చిత్ర యూనిట్ ను అప్రిషియేట్ చేయడం జరిగింది. నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి తో ఒక పవర్ ఫుల్ చిత్రాన్ని చేయనున్నారు. వీరి కాంబినేషన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :