హిట్ డైరెక్టర్ మరియు హిట్ నిర్మాత కలిసి ఓ మూవీ చేయనున్నారు. వారిద్దరెవరో కాదు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి మరియు లేడీ నిర్మాత స్వప్నా దత్ కలిసి మూవీ చేయడానికి సిద్ధమయ్యారు. అశ్విని దత్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన స్వప్నా దత్ మహానటి చిత్రం నిర్మించి సూపర్ హిట్ అందుకున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ కమర్షియల్ గానే కాకుండా నటి కీర్తి సురేష్ కి అలాగే దర్శక నిర్మాతలకు మంచి పేరుతెచ్చి పెట్టింది.
ఇక నందిని రెడ్డి సమంతతో ఓ బేబీ చిత్రం చేసి ఘనవిజయం అందుకున్నారు. కొరియన్ మూవీకి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ గా కాన్సెప్ట్ పరంగా కూడా ఆకట్టుకుంది. యూఎస్ లో వన్ మిలియన్ వసూళ్లు సాధించిన ఈ మూవీ ఆ ఘనత సాధించిన తొలి తెలుగు లేడీ ఓరియెంట్ చిత్రంగా నిలిచింది.
కాగా స్వప్నా దత్, నందినిరెడ్డి ప్రొడక్షన్ నంబర్ 6 చిత్రం చేయనున్నట్లు నేడు అధికారిక ప్రకటన ఇవ్వడం జరిగింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర నటీనటుల వివరాలు తెలియాల్సివుంది.
అన్ని మంచి శకనములే…
అందరికీ దసరా శుభాకాంక్షలతో..
Announcing Production No 6 of @SwapnaCinema
Produced by #PriyankaDutt #AshwiniDutt @SwapnaDuttChA film by @nandureddy4u ????
A @MickeyJMeyer Musical ????@RIP_apart @LakshmiBhupal #JayashreeLakshminarayan @UrsVamsiShekar pic.twitter.com/gFtIuXVbl0— Swapna Cinema (@SwapnaCinema) October 7, 2019


