బుక్ మై షో లో నాని ‘దసరా’ రికార్డు

Published on Mar 25, 2023 8:30 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా అందాల నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా లేటెస్ట్ గా తెరకెక్కిన మాస్ యాక్షన్ రస్టిక్ మూవీ దసరా. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఎంతో భారీ వ్యయంతో నిర్మించిన ఈ పాన్ ఇండియన్ మూవీ మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి అందించారు.

ఇక ఈ సినిమా యొక్క ప్రమోషన్స్ ని అన్ని భాషల్లో హీరో నాని తో పాటు యూనిట్ సభ్యులు గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే దసరా పై యువత తో పాటు మాస్ ఆడియన్స్ లో మంచి హైప్ ఏర్పడింది. కాగా ఈ మూవీ టికెట్ బుకింగ్స్ నిన్న ఓపెన్ అవ్వగా చాలా చోట్ల మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో దసరా 100కె ఇంట్రెస్ట్ లని దక్కించుకుని నాని సినిమాల్లో రికార్డు నెలకొల్పింది. తప్పకుండా ఆడియన్స్ యొక్క అంచనాలు అందుకుని మూవీ పెద్ద సక్సెస్ అవుతుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :