జోరుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన నాని ‘దసరా’ టీమ్

Published on Feb 28, 2023 5:05 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ అన్నీ కూడా ఆకట్టుకుని మూవీ పై ఆడియన్స్ లో నాని ఫ్యాన్స్ లో మంచి అంచనాలు ఏర్పరిచాయి. మార్చి 30న ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకాభిమానుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. అయితే విషయం ఏమిటంటే, రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో దసరా టీమ్ అప్పుడే ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా స్టార్ట్ చేసింది.

ఇప్పటికే పలు రేడియో ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు నాని. మరోవైపు అతి త్వరలో ఈ మూవీ నుండి త్వరలో రిలీజ్ కానున్న ఒక సాంగ్ యొక్క తమిళ వర్షన్ నిచెన్నై లో గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే అతి త్వరలో థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారట. మొత్తంగా అందరిలో మంచి ఆసక్తిని ఏర్పరిచిన దసరా మూవీ రిలీజ్ తరువాత ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :