నాని చేతుల మీదుగా “భళా తందనాన” టీజర్ విడుదల…వేరే లెవెల్ లో శ్రీ విష్ణు యాక్టింగ్!

Published on Jan 28, 2022 11:05 am IST

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు డిఫెరెంట్ జొనర్స్ లో డిఫెరెంట్ సినిమా లు చేస్తూ ప్రతి ఒక్క కథ కి వైవిధ్యం కనబరుస్తూ ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. శ్రీ విష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం భళా తందనాన. వారాహి చలన చిత్రం పతాకం పై ఈ సినిమా ను రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో కేథరిన్ థెరిస్సా శ్రీ విష్ణు సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ చిత్రం టీజర్ ను తాజాగా న్యాచురల్ స్టార్ నాని విడుదల చేశారు. టీజర్ ను విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ టీజర్ లో శ్రీ విష్ణు యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉందని చెప్పాలి. పొలిటికల్ టచ్ తో కూడిన టీజర్ ప్రేక్షకుల ను విశేషంగా ఆకట్టుకుంటుంది. గరుడ రామ్, పోసాని కృష్ణమురళి, సత్య అక్కల, అయ్యప్ప పి. శర్మ, శ్రీనివాస్ రెడ్డి, చైతన్య కృష్ణ, రవి వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్ రాజ్, రిచా జోషి తదితరులు నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :