నా సినిమాకు స్క్రిప్టే బలమంటున్న నాని !
Published on Jun 4, 2017 7:23 pm IST


ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు హిట్ సినిమాల్ని ప్రేక్షకులకందించిన యంగ్ హీరో నాని చేస్తున్న చిత్రం ‘నిన్ను కోరి’. ఫస్ట్ లుక్ దగ్గర్నుంచి పాజిటివ్ టాక్ ను సంపాదించించుకున్న ఈ చిత్రం తాజాగా రిలీజ్ చేసిన ‘అడిగా అడిగా’ పాటతో ఆ క్రేజ్ ను ఇంకాస్త పెంచుకుంది. ఈ సినిమాకు ప్రముఖ రచయిత కోన వెంకట్ రాసిన స్క్రిప్టే ప్రధాన బలమని నాని అంటున్నారు. అంతేగాక ఈ సినిమా కుడా తన కెరీర్లో ఒక మంచి చిత్రంగా నిలిచిపోతుందని నమ్మకం వ్యక్తం చేశారు.

ఎక్కువ శాతం అమెరికాలో షూటింగ్ జరిపుకున్న ఈ చిత్రం హైదరాబాద్, వైజాగ్లలో రెండు షెడ్యూల్స్ జరుపుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ‘జెంటిల్మెన్’ ఫేమ్ నివేతా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook