నాని “అంటే సుందరానికి” క్లోజింగ్ కలెక్షన్స్!

Published on Jul 7, 2022 1:40 pm IST


నాని చాలా ఆశలు పెట్టుకున్న సినిమా అంటే సుందరానికి. ఈ చిత్రం విమర్శకుల నుండి మంచి ప్రశంసలను కూడా పొందింది కానీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ కాలేదు. ఈ చిత్రం థియేట్రికల్ రన్‌తో పూర్తయింది మరియు త్వరలో OTT స్ట్రీమింగ్ కి కూడా సిద్దం అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల షేర్ సాధించగా, ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల షేర్ సాధించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 30 కోట్లకు లాక్ అయింది. కులాంతర ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. నరేష్, నదియా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో నజారియా నజీమ్ కథానాయికగా నటించింది.

సంబంధిత సమాచారం :