నాని “దసరా” టీజర్ కి డేట్ ఫిక్స్!

Published on Jan 25, 2023 6:00 pm IST

నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దసరా. ఈ చిత్రం ను అనౌన్స్ చేసినప్పటి నుండి సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉంది.

ఈ చిత్రం టీజర్ ను జనవరి 30, 2023 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఒక వీడియో ద్వారా వెల్లడించడం జరిగింది. తెలుగు తో పాటుగా, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం మార్చ్ 30 న గ్రాండ్ గా, వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. SLV సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :