“అనగనగా ఒక రాజు” టైటిల్ టీజర్ కి విశేష స్పందన!

Published on Jan 17, 2022 1:00 am IST


ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు చిత్రం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి హీరోగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు. ఈ చిత్రం ను సూర్య దేవర నాగ వంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం కి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అంతేకాక యూ ట్యూబ్ లో సైతం భారీ వ్యూస్ తో దూసుకు పోతుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

టైటిల్ టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :