నవీన్ పొలిశెట్టి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ టైటిల్ టీజర్ రాబోతుంది.!

Published on Jan 16, 2022 11:33 am IST

టాలీవుడ్ లో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి ఎలాంటి క్రేజ్ ను తెచుకున్నాడో తెలిసిందే. “జాతి రత్నాలు” బ్లాక్ బస్టర్ తర్వాత నవీన్ కి మరిన్ని ఆసక్తికర ఆఫర్స్ మొదలయ్యాయి. మరి తన ఇంట్రెస్టింగ్ లైనప్ లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ వారు తెరకెక్కిస్తున్న ఆసక్తికర ప్రాజెక్ట్ కూడా ఒకటి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ పైనే మేకర్స్ ఒక కీలక అప్డేట్ ని రివీల్ చేశారు.

ఈ సినిమా నుంచి ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు టైటిల్ టీజర్ ద్వారా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పేరు ఏంటో రివీల్ చేస్తున్నట్టు తెలిపారు. అలాగే మా రాజు గాడి స్టైల్ లో టైటిల్ అనౌన్సమెంట్ ఉంటుందని తెలుపుతున్నారు. మరి ఈ సినిమా టైటిల్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక ఈ చిత్రాన్ని కళ్యాణ్ శంకర్ నిర్మాణం వహిస్తుండగా త్రివిక్రమ్ నిర్మాణ సంస్థ ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు కూడా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :