నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు – నవాజుద్దీన్ సిద్దిఖీ

Published on Nov 21, 2021 9:16 pm IST

విభిన్న నటుడు నవాజుద్దీన్ సిద్దీఖీ ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ పై ఆ మధ్య సంచలన కామెంట్స్ చేస్తూ ఓటీటీలు పెద్ద దందా, ఎట్టి పరిస్థితుల్లోను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో నటించనని సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. నవాజుద్దీన్ సిద్దీఖీ మాట్లాడుతూ.. ‘నేను చాలా సినిమాల్లో నటిస్తున్నాను. ఆ చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ లోనే రిలీజ్ అవుతాయి.

ఇక నేను మీ ముందుకు వచ్చి కూర్చున్నాను అంటే అందుకు కారణం నెట్‌ఫ్లిక్స్. ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌తోనే నాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. మా టాలెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా చూపెట్టాలంటే ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌తోనే సాధ్యం అవుతుంది. నేను డిజిటల్ ప్లాట్‌ ఫామ్స్‌ లో నటించబోనని ఎప్పుడు చెప్పలేదు.

అప్పుడు నా మాటలను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నా నటన మాత్రమే నన్ను బతికిస్తుంది. నేను నటించడానికి మాత్రమే పుట్టాను. నేను షూటింగ్ మొదలుపెట్టగానే ఆ పాత్రలో లీనమైపోతాను ’’ అని నవాజుద్దీన్ సిద్దిఖీ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :