స్టార్ హీరోయిన్ పెళ్లి పై మళ్లీ రూమర్స్ !

Published on Mar 31, 2020 11:00 pm IST

లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యక్తిగత జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సౌత్ ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోయిన్ కు లేనివిధంగా ఈ స్టార్ హీరోయిన్ పై అనేక రూమర్స్ వస్తుంటాయి. ఇక ప్రస్తుతం విఘ్నేష్ శివన్ తో నయనతార పీకల్లోతు ప్రేమలో ఉంది. నిజానికి వీరి ప్రేమాయణం చాలా ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇద్దరూ తరచు తమ రిలేషన్ ఎలివేట్ అయ్యేలా హాలీడే ట్రిప్పులకు, పార్టీలకు వెళ్తుంటారు. దాంతో వీరి వ్యక్తిగత బంధానికి శుభం కార్డ్ పలుకుతూ త్వరలోనే ఈ జోడీ వివాహం చేసుకోబోతున్నారని ఎప్పటినుండో తమిళ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

పెళ్లికి నయనతార తొందరపడకపోయినా విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం తొందరపెడుతున్నారట. అందుకే నయనతార కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని.. సమ్మర్ తరువాత వీరు పెళ్లి ప్లాన్ చేస్తోన్నట్లు కోలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే నయనతారనో లేదా విఘ్నేషో ఎవరో ఒకరు స్పందించే వరకు ఆగాల్సిందే. ఏమైనా మీడియాకు నయనతార పెళ్లి పై రూమర్స్ బాగా అలవాటు అయిపోయాయి.

సంబంధిత సమాచారం :

X
More