‘ఉగ్రం’ మూవీకి ‘NBK 108’ టీమ్ బెస్ట్ విషెస్

Published on May 3, 2023 9:52 pm IST


అల్లరి నరేష్ తొలిసారిగా పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్ర పోషిస్తున్న తాజా సినిమా ఉగ్రం. ఈ మూవీలో మిర్నా హీరోయిన్ గా నటిస్తుండగా హరీష్ పెద్ది, సాహు గారపాటి దీనిని గ్రాండ్ లెవెల్లో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచిన ఉగ్రం, సమ్మర్ కానుకగా మే 5న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అయితే విషయం ఏమిటంటే, తాజగా నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న NBK 108 టీమ్ ఉగ్రం కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. నిజానికి ఈ సినిమాని కూడా ఉగ్రం నిర్మాతలే భారీగా నిర్మిస్తున్నారు.

ఇక దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఒక చిన్న ఇంట్రెస్టింగ్ వీడియో బైట్ రిలీజ్ చేసారు ఉగ్రం మేకర్స్. ఈ వీడియోలో ఉగ్రం దర్శకుడు విజయ్ కనకమేడల NBK 108 షూటింగ్స్ సెట్స్ లోకి వెళ్లడం, అక్కడ అనిల్ రావిపూడి తో పాటు హీరోయిన్ శ్రీలీల ఉగ్రం ట్రైలర్ నచ్చిందని, తప్పకుండా మూవీ కూడా అద్భుత విజయం అందుకోవాలని కోరుతూ విషెస్ చెప్పడం జరిగిగింది. కాగా ఈ ఇంట్రెస్టింగ్ వీడియో ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది.

సంబంధిత సమాచారం :