లేటెస్ట్ : NBK ‘అన్ స్టాపబుల్ – 2’ ట్రైలర్ రెడీ

Published on Oct 1, 2022 12:54 am IST


నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అయితే ఇటు సినిమాలతో పాటు అటు ఆహా ఓటిటి మాధ్యమం వారి క్రేజీ షో అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం కూడా సిద్ధమవుతున్నారు బాలకృష్ణ. ఇటీవల ప్రసారం అయిన అన్ స్టాపబుల్ సీజన్ 1 అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ ని భారీ వ్యూస్ ని సొంతం చేసుకుంది.

ఇక అతి త్వరలో సీజన్ 2 ప్రసారం కానుండగా దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆహా వారు ఒక సర్ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. మరొక నాలుగు రోజుల్లో అనగా అక్టోబర్ 4న ఈ షో యొక్క ట్రైలర్ రిలీజ్ అవుతుందని, అలానే బాలకృష్ణ మునుపెన్నడూ కనిపించని ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నారని ఒక ఇంట్రెస్టింగ్ పిక్ ద్వారా వెల్లడించారు. దానితో ఈ షో యొక్క ట్రైలర్ పై అందరిలో మంచి ఆసక్తి ఏర్పడింది. అలానే అదే రోజున సీజన్ 2 యొక్క ప్రసార తేదీని కూడా వారు అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :