తొలిరోజు దూకుడు చూపించిన ‘నేనే రాజు నేనే మంత్రి’


రానా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. రాజకీయ నాయకుడిగా రానా నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో రానా సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం కోసం రానా చేసిన ప్రమోషన్ కార్యక్రమాలు బాగా కలసి వచ్చాయి. అన్ని ఏరియాలలో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం నైజాం ఏరియాలో ఈ చిత్రం రూ 1.1 కోట్ల షేర్ ని తొలిరోజు సాధించించింది. వీకెండ్ తో పాటు ఇండిపెండెన్స్ డే వంటి సెలవులు కూడా ఉండడంతో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది. పొలిటికల్ లీడర్ గా రానా పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది.