నేనే రాజు నేనే మంత్రి ఏపీ, తెలంగాణ కలెక్షన్స్ వివరాలు
Published on Aug 12, 2017 4:21 pm IST


బాహుబలి చిత్రంతో రానా జాతీయ స్థాయి గుర్తింపు పొందాడు. ఆ చిత్రంలో రానా ప్రతినాయకుడు. ఈ మధ్య కాలంలో ఏమాత్రం విజయాలు లేని దర్శకుడు తేజ. ఈ నేపథ్యంలో వీరి కలయికలో వచ్చిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’.

ఈ చిత్రం రానా, తేజ ఇద్దరికీ కీలకమే. శుక్రవారం నేనే రాజు నేనే మంత్రి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి లై, జయ జానకి నాయక చిత్రాలనుంచి పోటీ ఎదురైన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రం రెండు రాష్ట్రాల్లో రూ 3.75 కోట్ల షేర్ ని వసూలు చేసింది. పోటీ ఉన్నపటికీ పొలిటికల్ డ్రామా, రానా పెర్ఫామెన్స్ ఈ చిత్రానికి కలసి వచ్చింది. ఓవర్సీస్ లో కూడా ఈచిత్రం మంచి వసూళ్ళని రాబడుతోంది. నార్త్ అమెరికాలో తొలిరోజు 250000 డాలర్లను రాబట్టింది.

 
Like us on Facebook