మహేష్ కు కొత్త టార్గెట్ సెట్ చేసిన రామ్ చరణ్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘భరత్ అనే నేను’ ఈ నెల 20న విడుదలకానుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డ్ సృష్టిస్తుందని అభిమానులు భావిస్తున్నారు. రెండు వారాల ముందు వరకు పరిశ్రమలో గ్రాస్ పరంగా బాహుబలి తర్వాత స్థానంలో రూ.104 కోట్లతో చిరు ‘ఖైదీ నెం 150’ ఆ తర్వాత మహేష్ ‘శ్రీమంతుడు’ ఉండేవి. కాబట్టి ‘భరత్ అనే నేను’కు ‘ఖైదీ’ కలెక్షన్స్ టార్గెట్ అని అందరూ భావించారు.

కానీ గత నెల 30న విడుదలైన రామ్ చరణ్ ‘రంగస్థలం’ ఇప్పటికే ‘ఖైదీ’ ని దాటి నాన్ బాహుబలి రికార్డుగా నిలిచింది. ఇప్పటికీ సినిమా మంచి వసూళ్లను రాబడుతుండటంతో ఈ సినిమా లైఫ్ టైం వసూళ్లు భారీ సంఖ్య వద్దే ఆగేలా కనిపిస్తున్నాయి. దీంతో ఇంకొద్దిరోజుల్లో రానున్న మహేష్ సినిమాకు సరికొత్త భారీ టార్గెట్ ఏర్పడినట్లైంది. మరి ‘శ్రీమంతుడు’ చిత్రంతో ‘అత్తారింటికి దారేది’ రికార్డుల్ని బద్దలుకొట్టిన మహేష్ ఈసారి తన కొత్త టార్గెట్ ను ఎంత సమర్థవంతంగా ఛేదిస్తారో చూడాలంటే ఇంకో ఐదు రోజులు ఆగాల్సిందే.