విజయవాడలో నిఖిల్ సినిమా ఆడియో !
Published on Mar 9, 2018 11:45 am IST

నిఖిల్ నటించిన తాజా సినిమా కిరాక్ పార్టీ వచ్చే శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకు శరణ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆడియో వేడుకను మర్చి 10న విజయవాడ ఉషారమా ఇంజినీరింగ్ కాలేజీ లో గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. సినిమా విడుదల దగ్గర పడ్డంతో ప్రమోషన్స్ వేగవంతం చేసారు యూనిట్.

సిమ్రాన్ పరీజ, సంయుక్త హెగ్డే హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు అంజనీస్ లోకనాథ్ సంగీతం అందించాడు. సుధీర్ వర్మ , చందు మొండేటి ఈ సినిమాకు రచనా సహకారం అందించారు. ఈ సినిమా తరువాత నిఖిల్ కనితన్ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే ప్రారంభం అయ్యింది.

 
Like us on Facebook