నిఖిల్ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది !
Published on Mar 3, 2018 10:23 am IST

నిఖిల్ నటించిన కిరిక్ పార్టి సినిమా ఈ నెల 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు ఈ హీరో. శరణ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా ఏకే.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.

కిరాక్ పార్టీ సినిమా తరువాత నిఖిక్ చేయబోయే సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభం అయ్యింది. తమిళ్ కనితన్ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సంతోష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్ గా నటించబోతుంది వార్తలు వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదని సమాచారం.

 
Like us on Facebook