పాత్ర కోసం వర్కవుట్స్ మొదలుపెట్టిన యంగ్ హీరో !
Published on Feb 19, 2018 6:27 pm IST

యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’ని తెలుగులో ‘కిరాక్ పార్టీ’గా రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఇది వరకే విడుదలవ్వాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పెండింగ్ ఉండటంతో వాయిదాపడి మార్చి 22న రిలీజ్ కానుంది. దీని తర్వాత నిఖిల్ తమిళ హిట్ సినిమా ‘కనితన్’ రీమేక్లో కూడా నటించనున్నాడు.

త్వరలో ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది. ఈ ఇప్పటికే ‘కిరాక్ పార్టీ’లో కాలేజ్ కుర్రాడిగా కనిపించగా ఈసారి ఇంకో సరికొత్త మేకోవర్లో కనిపించనున్నాడు. ఇందుకోసం బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు నిఖిల్. ఇప్పటికే జిమ్ లో వర్కవుట్స్ స్టార్ట్స్ చేసిన ఈ హీరో ఆ వీడియోని పోస్ట్ చేసి కొత్త పాత్రకు సిద్దమవుతున్నానంటూ ప్రేక్షకులకి తెలియజేశాడు. ఠాగూర్ మధు నిర్మించనున్న ఈ సినిమాను ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సంతోష్ డైరెక్ట్ చేయనుండగా మేఘా ఆకాష్ పేరు హీరోయిన్ల జాబితాలో తొలిస్థానంలో వినిపిస్తోంది.

 
Like us on Facebook