బిజీ బిజీగా గడుపుతున్న నితిన్ !
Published on Mar 11, 2018 9:28 pm IST

యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యొక్క షూటింగ్ పార్ట్ పూర్తికాగా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలో భాగంగా హీరో నితిన్ తన పాత్ర తాలూకు డబ్బింగ్ చెబుతూనే ప్రమోషన్స్ లో సైతం చురుగ్గా పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, మూడు పాటలు మంచి స్పందన తెచ్చుకోవడం, త్రివిక్రమ్ కథను అందించడంతో సినిమాపై అంచనాలు మంచి స్థాయిలోనే ఉన్నాయి. మేఘా ఆకాష్ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే నితిన్ దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమాను కూడ ఇటీవలే మొదలుపెట్టాడు.

 
Like us on Facebook