“గాడ్ ఫాథర్” పై “ఆచార్య” ఎఫెక్ట్ అసలు లేదా.?

Published on Sep 16, 2022 2:33 am IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “గాడ్ ఫాథర్” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ రాజా అయితే తెరకెక్కించారు. మరి దసరా కానుకగా రిలీజ్ కి సిద్ధం గా ఉన్న ఈ చిత్రంపై ఆల్రెడీ మంచి హైప్ ఉంది. అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రంకి ముందే మెగాస్టార్ నుంచి ఆల్రెడీ మరో సినిమా వచ్చింది.

ఆ చిత్రమే “ఆచార్య”. ఇక ఈ సినిమా అందుకున్న ఫలితం కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. అయితే ఈ సినిమా ఎఫెక్ట్ అయితే ఏమాత్రం ఇప్పుడు రాబోతున్న “గాడ్ ఫాథర్” పై లేనట్టే తెలుస్తుంది. ఈ చిత్రానికి ఇప్పుడు భారీ మొత్తంలో బిజినెస్ నడుస్తున్నట్టుగా టాక్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ మెగాస్టార్ సినిమా గత ప్లాప్ ప్రభావం లేకుండా సాలిడ్ బిజినెస్ చేస్తుందని అంటున్నారు. మరి ఈ సినిమాకి ఎంతమేర బిజినెస్ జరుగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :