ఇన్ని సీజన్స్ లో అబిజీత్ ని మాత్రం ఎవరూ రీప్లేస్ చెయ్యలేకపోయారా

ఇన్ని సీజన్స్ లో అబిజీత్ ని మాత్రం ఎవరూ రీప్లేస్ చెయ్యలేకపోయారా

Published on Dec 19, 2023 1:02 PM IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ వద్ద మోస్ట్ పాపులర్ అయ్యినటువంటి గ్రాండ్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం తెలిసిందే. మరి ఇప్పటివరకు సక్సెస్ ఫుల్ గా మొత్తం 7 సీజన్లను ఈ షో కంప్లీట్ చేసుకుంది. మరి ఒకో సీజన్లో ఒకో విజేత వారితో పాటుగా మరికొందరు విన్ కాకపోయినప్పటికీ ఈ ప్లాట్ ఫామ్ తో అయితే సాలిడ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు.

అయితే టాలీవుడ్ సినిమా నుంచి కూడా కొందరు వెళ్లారు ఇలా అనేకమంది బాగా తెలిసిన తెలియని వాళ్ళు కూడా బిగ్ బాస్ హౌస్ లో కనిపించారు కానీ ఓ కంటెస్టెంట్ కం టైటిల్ విన్నర్ ఇచ్చిన హై ని మాత్రం మరెవ్వరూ ఇవ్వలేదు అనేది ఈ షో వీక్షకుల్లో మరోసారి వినిపిస్తున్న మాట. మరి ఆ కంటెస్టెంట్ నే అబిజీత్. ఈ ఏడు సీజన్లని కంప్లీట్ చూసిన వాళ్ళు ప్రస్తుతం మాట్లాడుకుంటున్న మాట కూడా ఇదే.

ఇంతమంది కంటెస్టెంట్స్ విన్నర్స్ ఉన్నప్పటికీ అబిజీత్ తరహా క్లారిటీ ఉన్న కంటెస్టెంట్ ని ఓ సీజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడలేదు అంటున్నారు. ఈ ఒపీనియన్ అయితే షో ఫాలోవర్స్ లో దాదాపు అందరికీ ఉందని చెప్పాలి. మరి ఆ రేంజ్ లో అయితే తాను తన మార్క్ తెలుగు బిగ్ బాస్ లో వేసుకున్నాడు. కానీ ఇంట్రెస్టింగ్ గా తాను తప్ప మిగతా కంటెస్టెంట్స్ చాలా టాలీవుడ్ లో బిజీగా కనిపిస్తుండడం గమనార్హం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు