కోలీవుడ్ బిగ్గెస్ట్ క్లాష్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదా.?

కోలీవుడ్ బిగ్గెస్ట్ క్లాష్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదా.?

Published on Nov 9, 2022 1:00 PM IST

తమిళ నాట చాలా ఏళ్ల తర్వాత సంక్రాంతి రేస్ మాంచి రసవత్తరంగా మారింది. అక్కడి ఇద్దరు బిగ్ స్టార్స్ అయినటువంటి దళపతి విజయ్ మరియు థలా అజిత్ కుమార్ లు నటించిన చిత్రాలు “వరిసు” అలాగే “తునివు” చిత్రాలు సంక్రాంతి బరిలో దిగనున్నాయి. దీనితో ఈ బిగ్గెస్ట్ క్లాష్ కోసం కేజ్రీగా మారగా అక్కడ వసూళ్లు ఎలా ఉంటాయి అనేది కేజ్రీగా మారింది.

దీనితో ఈ చిత్రాలు రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తమిళ నాట ఈ రెండు చిత్రాలకి రిలీజ్ విషయంలో ఎలాంటి తేడా రాదని కోలీవుడ్ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. రెండు చిత్రాలకి కూడా సమానంగా థియేటర్స్ దక్కుతాయని అంటున్నారు. అందుకే ఎలాంటి ఇబ్బంది కంగారు ఫ్యాన్స్ పడక్కర్లేదని తెలుస్తుంది.

ఇక వరిసు సినిమాకి అయితే మన టాలీవుడ్ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తుండగా అజిత్ సినిమాకి వలిమై ఫేమ్ హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు