నాన్ స్టాప్ గా శంకర్..ఇప్పుడు “ఇండియన్ 2” కి.!

Published on Feb 17, 2023 8:00 am IST

పాన్ ఇండియా సినిమా దగ్గర గా ఎప్పుడో తనదైన ముద్ర వేసి ఇండియా సినిమాని హాలీవుడ్ లెవెల్లో పరిచయం చేసిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శంకర్ అని చెప్పాలి. తనదైన సినిమాలు గ్రాండ్ ఎలిమెంట్స్ తో సాలిడ్ ఎమోషన్స్ మరియు మెసేజ్ తో ప్రెజెంట్ చేసే తాను ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లోకనాయకుడు కమల్ హాసన్ తో భారీ సినిమాలు చేస్తున్నారు.

అయితే ఓ హీరో ఏకకాలంలో రెండు సినిమాలు ఒకేసారి చేయడం చూస్తూ ఉంటాం కానీ ఒక దర్శకుడు ఏకకాలంలో రెండు భారీ సినిమాలు ఏక కాలంలో చేయడం అనేది కాస్త అరుదు గానే చూస్తాము. ఇప్పుడు అలా శంకర్ చరణ్ మరియు కమల్ హాసన్ ల సినిమాలతో నాన్ స్టాప్ వర్క్ లో ఉన్నారు. జస్ట్ కొన్ని రోజులు కితమే చరణ్ 15 షూట్ లో పాల్గొన్న శంకర్ అది ఇలా కంప్లీట్ కాగానే వెంటనే ఇండియన్ 2 షూట్ లో పాల్గొన్నట్లు గా తెలిపారు. మళ్లీ బ్యాక్ టు ఇండియన్ 2 సెట్స్ అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీనితో శంకర్ మాత్రం ఫుల్ స్వింగ్ లో తన సినిమాలు కంప్లీట్ చేస్తూ అదరగొడుతున్నారు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :