రామ్ సినిమాలో ఆమె కూడా ?

Published on Mar 25, 2023 10:34 pm IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – హీరో రామ్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని.. ఈ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటెలాతో పాటు నోరా ఫతేహి కూడా నటిస్తోందని తెలుస్తోంది. అలాగే సీనియర్ హీరో సునీల్ శెట్టి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. సునీల్ శెట్టి కారణంగా కచ్చితంగా రామ్ సినిమాకి బాలీవుడ్ లో ప్లస్ కానుంది.

ఇక ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్ లో కనిపిస్తాడని ఇప్పటికే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ అఖండ సినిమాతో అదిరిపోయే సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు బోయపాటి. కాబట్టి.. బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, రామ్ కూడా ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం :