‘ఖైదీ 2’ లో నెగటివ్ రోల్ చేయనున్న యంగ్ డైరెక్టర్ ?

‘ఖైదీ 2’ లో నెగటివ్ రోల్ చేయనున్న యంగ్ డైరెక్టర్ ?

Published on Nov 23, 2022 1:32 AM IST


కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో 2019లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ఖైదీ. మాస్ యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో ఢిల్లీ అనే లారీ డ్రైవర్ పాత్రలో తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు కార్తీ. ఇక దాని తరువాత లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన విక్రమ్ మూవీలో ఢిల్లీ పాత్రని కొన్ని క్షణాలు చూపించారు.

అయితే అతి త్వరలో ఖైదీ 2 మూవీ ని తెరకెక్కించనున్నారు లోకేష్. కాగా లేటెస్ట్ కోలీవుడ్ బజ్ ప్రకారం వచ్చే ఏడాది పట్టాలెక్కనున్న ఈ మూవీలోని ఒక ముఖ్య నెగటివ్ రోల్ లో ప్రముఖ యువ దర్శకడు మరియు నటుడైన రాఘవ లారెన్స్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల వచ్చిన విక్రమ్ మూవీ క్లైమాక్స్ లో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించిన విషయం తెలిసిందే. అయితే సూర్య బ్యాచ్ లో ఒక కీలక వ్యక్తిగా లారెన్స్ నెగటివ్ రోలర్ లో కనిపించనున్నారట. మొత్తంగా ఈ న్యూస్ ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. కాగా ఈ మూవీకి సంబంధించి అన్ని వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు