ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు !

18th, January 2018 - 10:48:40 AM

ప్రతియేటా ఎన్టీఆర్ వర్ధంతి రోజున బాలకృష్ణ, హరికృష్ణ, చంద్రబాబు సహా నందమూరి కుటుంబీకులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తుంటారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ తో పాటు పలువురు టిడిపి కార్యకర్తలు పార్టి నాయకులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.

తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్‌ ఈరోజు ఆయన 22 వ వర్ధంతి కావున ఎన్టీఆర్ బయోపిక్ కు సంభందించిన పోస్టర్ విడుదల అయ్యింది. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించబోవడం విశేషం. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్లు ఈ రోజు ఘనంగా జరగనున్నాయి.