లేటెస్ట్ : ఎన్టీఆర్ 30 మూవీ లాంచింగ్ టైం ఫిక్స్

Published on Mar 22, 2023 8:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి ఆసక్తి నెలకొని ఉంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తొలిసారిగా ఈ మూవీ ద్వారా తెలుగులోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుండగా దీనికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ మూవీ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రేపు ఉదయం 8 గం. 30 ని. ల నుండి లైవ్ లో ప్రసారం చేయనున్నారు. కాగా ఈ మూవీ ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని పరిమిత అతిథులతో నిర్వహించనుండగా ఏప్రిల్ మొదటి వారం నుండి మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థల పై నిర్మితం కానున్న ఈ మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా రానున్నాయి.

సంబంధిత సమాచారం :