రివర్స్ గేర్ వేసిన ఎన్టీఆర్, చరణ్ !
Published on Mar 13, 2018 12:01 pm IST

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ , చరణ్ నటించబోతున్న సినిమా ఈ ఏడాది అక్టోబర్ నుండి ప్రారంభంకానుంది. ఈ సినిమాకు సంభందించిన లుక్ టెస్ట్ కోసం ఎన్టీఆర్, చరణ్ కొన్ని రోజుల ముందు లాస్ ఏంజిల్స్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఫోటో షూట్ పూర్తి చేసుకున్న ఇద్దరు హీరోలు ఈరోజు హైదరాబాద్ తిరిగి రావడం జరిగింది.

ఈ సినిమాకు సంభందించిన ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు చిత్ర యూనిట్. సినిమాకు సంబందించిన విషయాలు బయటికి పొక్కకుండా జాగ్రత్తపడుతున్నారు. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ సినిమాలో పోలీస్ అధికారులుగా కనిపించబోతున్నారు. ఫ్యామిలీ డ్రామాకు ఎమోషన్స్ జోడించి రాజమౌళి ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు సమాచారం.

 
Like us on Facebook