‘ఎన్టీఆర్ బయోపిక్’ నుంచి ఇంట్రస్టింగ్ పిక్స్ !

Published on Oct 22, 2018 3:59 pm IST

బాలకృష్ణ ప్రధాన పాత్రగా క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ పార్ట్స్ శరవేగంగా తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో నటిస్తోన్న నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను వరుసగా విడుదల చేస్తూ వస్తోంది చిత్రబృందం. తాజాగా ఎన్టీఆర్ గెటప్ లో ఉన్న బాలయ్యకు సంబంధించిన రెండు పిక్స్‌ను విడుదల చేస్తూ.. ‘నందమూరి అందగాడు చిందులేయగా.. తెలుగువాడి నరనరమూ నాట్యమాడగా..’ అంటూ విడుదల చేశారు. అయితే పిక్స్ చూస్తుంటే.. బాలయ్య అచ్చం ఎన్టీఆర్‌ ను గుర్తుకు తెస్తున్నారు.

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. కాగా జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :