RRR – యూఎస్ లో ఎన్టీఆర్ పై మాస్ ప్రమోషన్స్ చేస్తున్న ఫ్యాన్స్.!

RRR – యూఎస్ లో ఎన్టీఆర్ పై మాస్ ప్రమోషన్స్ చేస్తున్న ఫ్యాన్స్.!

Published on Mar 10, 2022 10:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ వీక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. మరి ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో చాలా ఏళ్ల తర్వాత తారక్ ఎంట్రీ ఇవ్వనుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్ లో తమ హీరోకి వెల్కమ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

కొన్ని రోజులు కితమే యూఎస్ లో ఒక షో కి థియేటర్ మొత్తాన్ని బ్లాక్ చేసేసిన యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఇప్పుడు తారక్ పై అక్కడి మాల్స్ లో స్పెషల్ హోర్డింగ్స్ పై అదిరే ప్రమోషన్స్ కూడా కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ నే స్టార్ట్ చేసుకున్నారు. దీనితో ఇవి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి అయితే ఎన్టీఆర్ కోసం తన అభిమానులు విదేశీ గడ్డపై ఓ రేంజ్ లో వెల్కమ్ చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు